బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఈ చిత్ర జర్నీ తమకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇక తాజాగా హృతిక్ రోషన్ ఈ చిత్ర షూటింగ్ ముగింపుకు సంబంధించి సెట్స్‌లో కేక్ కటింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘149 రోజుల పాటు చేసిన ఛేజ్, యాక్షన్, డ్యాన్స్, బ్లడ్, చెమటలు, గాయాలు.. ఇవన్నింటికీ పూర్తి న్యాయం చేశాం. తారక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఉంది.. ఈ కాంబినేషన్‌ను స్క్రీన్స్‌లో చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం..’ అంటూ హృతిక్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.