హైదరాబాద్ వంటి మెట్రో సిటీలలో పలు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఉంటున్న ప్రజలు చాలా మంది ఉంటారు. ఇక్కడ బ్రతికే నిరుద్యోగుల పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది ఆర్థికంగా ఇక్కడ చాలా కష్టాలను ఎదుర్కుంటారు. “హాస్టల్ డేస్” అనే చిత్రంలో ఒక యువతీ తన జీవనోపాది కోసం హైదరాబాద్ కి రావడం జరుగుతుంది ఇక్కడ తను ఎదురుకున్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని పి సి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
హీరో రాజ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఈయన సరసన గజల్ చాంద్ ఠాకూర్, శాఫాలి మరియు నాయమాత్ నటిస్తున్నారు ఈ చిత్రాన్ని ఫిలిం మీడియా క్రియేషన్స్ బ్యానర్ మీద అల్లాణి శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తయ్యింది త్వరలో ఆడియో విడుదల చెయ్యనున్నారు.
ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలన్నీ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించామని నిర్మాత తెలిపారు. జయ ప్రకాష్ రెడ్డి, బాబు మోహన్, సుమన్ శెట్టి, ఏవియస్, సుభాషిణి తదితరులు నటించారు ఈ చిత్రానికి మోహిని రాజ్ సంగీతం అందించారు.