‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ను ప్రకటించిన హొంబాలే ఫిలింస్

కేజియఫ్, కాంతార, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన హొంబాలే ఫిలింస్ తన లైనప్‌లో మరికొన్ని క్రేజీ చిత్రాలను పెట్టింది. అయితే, ఈ ప్రొడక్షన్ హౌజ్ తాజాగా మరో సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ బ్యానర్ త్వరలోనే ఓ భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రేక్షకులను అందించేందుకు సిద్ధమైంది.

‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ అంటూ ఎపిక్ మైథలాజికల్ సిరీస్ చిత్రాలను ఈ బ్యానర్ రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘మహావతార్ నరసింహా’ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 జూలై 25న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మొత్తంగా ఈ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’‌లో ఏకంగా 7 భారీ చిత్రాలు ఉండబోతున్నాయని.. ఇవి విష్ణు అవతారాలలో ఒక్కో అవతారాన్ని చూపించబోతున్నట్లు వారు తెలిపారు.

2025లో ‘మహావతార్ నరసింహా’, 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాదీశ్, 2033లో మహావతార్ గోకులనందన, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 చిత్రాలను వరుసగా తీసుకురాబోతున్నట్లు హొంబాలే ప్రకటించింది. ఇక ఈ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌న క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి హొంబాలే మన ముందుకు తీసుకురాబోతున్నారు.

Exit mobile version