కూలీ మాస్ అప్డేట్ : క్యాచీ ట్యూన్‌తో అదిరిపోయిన ‘చికిటు’ సాంగ్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేశాయి.

తాజాగా కూలీ చిత్రం నుంచి మరో సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను వారు రిలీజ్ చేశారు. చికిటు అంటూ సాగే ఈ సాంగ్‌ను మ్యూజిక్ వీడియోగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మరోసారి అదిరిపోయే క్యాచీ ట్యూన్‌తో కంపోజ్ చేసిన విధానం సూపర్‌గా ఉంది. ఇక ఈ మాస్ సాంగ్‌కు థియేటర్లలో ప్రేక్షకులు డ్యాన్స్ వేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. అటు ఈ పాటకు రజినీకాంత్ కూడా తనదైన డ్యాన్స్ స్టెప్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. కాగా మరో వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ టి.రాజేంద్రన్ కూడా మనకు ఈ మ్యూజిక్ వీడియోలో కనిపిస్తారు.

మొత్తానికి మరోసారి రజినీకాంత్-అనిరుధ్ కాంబోలో అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్ రానుందని ఈ పాట ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version