వెంకీ-త్రివిక్రమ్ మూవీ మొదలయ్యేది అప్పుడే..?

టాలీవుడ్‌లో త్వరలో రాబోయే విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమాను ఆగస్టు నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీంతో త్వరలో క్యాస్టింగ్‌ను ఫైనల్ చేసి ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఆగస్టులో ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయమా లేదా.. అనేది వేచి చూడాలి.

Exit mobile version