‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవన్ కెరీర్లో మొదటి హిస్టారికల్ కం పాన్ ఇండియా సినిమా ఇది కాగా అనౌన్స్ చేసిన సమయంలో ఉన్న హైప్ వేరే లెవెల్లో ఉండేది కానీ సినిమా దాదాపు ఐదేళ్లు ఆలస్యం అయ్యింది.

ఇలా ఎట్టకేలకి ఈ ఏడాదిలో రిలీజ్ కాబోతున్న సినిమా ట్రైలర్ కోసం ముందు అంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ట్రైలర్ పై అధికారిక అప్డేట్ ఈ వారం లోనే రాగా మేకర్స్ లేటెస్ట్ గానే సాలిడ్ ఫైనల్ ట్రైలర్ కట్ ని లాక్ చేసేసినట్టుగా తెలుస్తుంది. ఈ వారంలోనే అప్డేట్ వీకెండ్ కి లేదా వచ్చే వారం మొదట్లో ట్రైలర్ ని వదిలేలా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. మరి ఈ ట్రైలర్ వస్తేనే చాలా లెక్కలు మారే అవకాశం ఉంది. మరి చూడాలి వీరమల్లు విధ్వంసం ఎలా ఉంటుంది అనేది.

Exit mobile version