తమిళ నాట కూడా ‘కూలీ’ రికార్డు బిజినెస్?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర ఇంకా చాలా మంది స్టార్స్ తో టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కూలీ”. గట్టి హైప్ ఉన్న ఈ సినిమా కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అనే రేంజ్ లో ఆశలు దీనిపై ఉన్నాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతుంది.

మన తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 50 కోట్ల మేర బిజినెస్ అంటూ టాక్ స్ప్రెడ్ అవుతుండగా తమిళ నాట కూడా రికార్డు ధరలు మేకర్స్ అడుగుతున్నారట. ఇలా తమిళనాట 110 కోట్ల డీల్ మేకర్స్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కూలీ డిమాండ్ మాత్రం గట్టిగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ ఆగస్టు 15న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version