యూఎస్ మార్కెట్ లో ఆగని ‘హిట్ 3’.. మరో సాలిడ్ మార్క్

యూఎస్ మార్కెట్ లో ఆగని ‘హిట్ 3’.. మరో సాలిడ్ మార్క్

Published on May 3, 2025 11:01 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ వైలెన్స్ యాక్షన్ చిత్రం “హిట్ 3”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా అభిమానులు సహా ఆడియెన్స్ అంచనాలు రీచ్ అయ్యి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా దూసుకెళ్తుంది. మరి డే 1 కే రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం యూఎస్ లో అయితే ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పాలి.

యూఎస్ మార్కెట్ లో నానికి ఉన్న క్రేజ్ ఏపాటిదో తెలిసిందే. అలా వచ్చిన ఈ సినిమా అప్పుడే 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ఈ రెండు రోజుల్లోనే అందుకొని దుమ్ము లేపింది. దీనితో ఈ వారాంతంలో సునాయాసంగా 2 మిలియన్ మార్క్ ని దాటేసి అక్కడ కూడా నాని కెరీర్లోనే కాకుండా మన స్టార్స్ తాలూకా భారీ వసూళ్లు దగ్గరకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ మాస్ సునామి ఇపుడు కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు