న్యాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించగా, ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తనదైన ట్రీట్ ఇచ్చేందుకు శైలేష్ కొలను సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమాపై అప్పుడే బజ్ క్రియేట్ అవుతోంది. మరి శైలేష్ ఈసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంతో ఎలాంటి ఇంప్రెషన్ అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.