అనుష్క ను పూర్తి స్థాయిలో వెండి తెరపై చూసి చాలా కాలం అవుతుంది. ఆమె 2018 లో వచ్చిన భాగమతి చిత్రం తరువాత మరో సినిమా చేయలేదు. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. రెండేళ్ల తరువాత అనుష్క నటించిన నిశ్శబ్దం ఏప్రిల్ 2న విడుదల కానుంది. మాధవన్ హీరోగా అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె మూగదైన పెయింటింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. కాగా నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఓ క్రైమ్ మిస్టరీ చుట్టూ సాగే ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉందనిపిస్తుంది. మాధవన్, అనుష్క ల వెకేషన్ టూర్ లో జరిగిన భయంకర సంఘటనల వెనుక ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేదే పెద్ద మిస్టరీ. ఆ ఘటనలో బాధితురాలిగా అనుష్క కనిపిస్తుండగా, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే కాప్ గా అంజలి నటిస్తుంది. ఇక షాలిని పాండే అనుష్క స్నేహితురాలు పాత్ర చేస్తుండగా ఆమెది కూడా కీలకమైన రోల్ అనిపిస్తుంది. ఏది ఏమైనా అంచనాలకు తగ్గట్టుగా నిశ్శబ్దం ట్రైలర్ చాల బాగుంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.కోనా వెంకట్, టి జి విశ్వ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి