ఉత్కంఠ రేపే సస్పెన్సు థ్రిల్లర్ గా ‘వలయం’

లక్ష్,దిగంగన హీరో హీరోయిన్స్ గా రమేష్ కడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వలయం. దర్శకుడు సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కించగా పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈనెల 21న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈనేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషాలకు పైగా సాగిన ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది.

కొత్తగా పెళ్ళైన జంటగా లక్ష్, దిగంగన కనిపిస్తుండగా, అనుకోకుండా దిగంగన కనిపించకుండా పోతుంది. సడన్ గా ఆమెకు ఏమైంది? ఆమె కావాలని ఎక్కడికైనా వెళ్లిందా? లేక ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఒక వేళా కిడ్నాప్ చేస్తే అతను ఎవరు? అనే సస్పెన్సు ఆధారంగా వలయం తెరకెక్కింది. వలయం చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version