హెబ్బా పటేల్ పేరు మన టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేదు పేరు. తన మొట్ట మొదటి సినిమా “కుమారి 21 ఎఫ్”తోనే కేవలం నటనతో మాత్రమే కాకుండా గ్లామరస్ గా కూడా కనిపించి కుర్రకారులో బ్లాస్ట్ లా మారింది. ఆ తర్వాత కూడా తనకు తగ్గట్టుగానే ఒకటి రెండు మంచి చిత్రాల్లో కనిపించింది కానీ ఆ తర్వాత మాత్రం చాలా సిల్లీ ఛాయిస్ లతో తన ట్రాక్ తప్పింది. ఏవేవో సినిమాలు ఒకే చేస్తూ ఫేడ్ అవుట్ అవ్వడం మొదలయ్యింది.
అలాగే ఇపుడు లేటెస్ట్ గా చేసిన చిత్రం “ఒరేయ్ బుజ్జిగా”లో కూడా ఆమె రోల్ ఏమంత గొప్ప రోల్ కూడా కాదు. జస్ట్ క్యామియో కు పరిమితం చేసారు తప్ప ఆమె పెర్ఫామెన్స్ కు అంతగా స్కోప్ లేనిదిగా మారింది. దీనితో ఈమెకు అక్కడ నుంచి అలాంటో పాత్రలే వస్తున్నాయి. దీనితో ఆమెకు మంచి పాపులారిటీ ఉన్నప్పటికీ దానిని సరైన మార్గంలో వినియోగించుకోలేకపోతుంది. మరి రానున్న రోజుల్లో అయినా సరే మంచి రోల్స్ ను ఎంచుకొని ట్రాక్ పడుతుందో లేదో చూడాలి.