గబ్బర్ సింగ్ వరుసగా 5వ రోజు కూడా ప్రేక్షకులని అలరిస్తున్నాడు. మాస్ ఏరియాల్లో టికెట్స్ అస్సలు దొరకకపోవడం అటు ఉంచితే మల్టి ప్లెక్స్ థియేటర్లలో కూడా అడ్వాన్సు బుకింగ్ రూపంలో అమ్ముడుపోతున్నాయి. మాస్ ఏరియాల్లో బ్లాకు టికెట్ల రూపంలో అమ్ముడుపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని ఏరియాల్లో ఉన్న అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండటం విశేషం. ఈ వారంతం వరకు కూడా ఇలాగె కొనసాగితే రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. పవన్ కళ్యాణ్ నుండి పదేళ్ళ తరువాత అభిమానులను అలరించే సినిమా రావడంతో వారు ఆనందంగా ఉన్నారు.