బాలీవుడ్ తెరపై హర్షవర్ధన్ రానే

బాలీవుడ్ తెరపై హర్షవర్ధన్ రానే

Published on Mar 22, 2014 9:18 AM IST

Harshvardhan-Rane

రామ్ చరణ్ తరువాత మరో తెలుగు నటుడు బాలీవుడ్ లో రంగప్రవేశం చేయనున్నాడు. తకిట తకిట, అవును మరియు ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించిన హర్ష త్వరలో ‘సత్రా కో షాదీ హై’ అనే హిందీ సినిమాలో ఒక హీరోగా ఎంపికయ్యాడు.

ఒక పత్రకకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హర్షవర్ధన్ ఈ వార్తను ధృవీకరించాడు. ఈ సినిమాకు జాన్ అబ్రహం నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ భోపాల్ లో జరుపుకుంటుంది. మిగిలిన తారల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

ఈ నెల మొదట్లో హర్ష తెలుగులో నీలకంట తెరకెక్కిస్తున్న ‘మాయ’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్నాడు. అతీత శక్తుల నడుమ సాగే ఈ స్టొరీపై హీరో ఆసక్తిగా వున్నాడు. ఈ సినిమాకాకుండా శేఖర్ కమ్ముల అనామిక చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు.

తాజా వార్తలు