‘వీరా’ ర్యాంపేజ్.. భారీ బుకింగ్స్ తో విధ్వంసం!

‘వీరా’ ర్యాంపేజ్.. భారీ బుకింగ్స్ తో విధ్వంసం!

Published on Jul 23, 2025 3:14 PM IST

Pawan-Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు క్రిష్, అలాగే జ్యోతికృష్ణ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి తెలుగు స్టేట్స్ లో రికార్డు ఓపెనింగ్స్ కి మొత్తం సెట్టయ్యింది.

అయితే మొదట ఏపిలో బుకింగ్స్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఎట్టకేలకి నైజాంలో కూడా విడుదల అయ్యి, ప్రీమియర్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మరి ఈ బుకింగ్స్ లో వీరా ర్యాంపేజ్ చూపిస్తున్నాడని చెప్పాలి. ఆల్రెడీ బుక్ మై షో అలాగే డిస్ట్రిక్ట్ యాప్స్ లో హాఫ్ మిలియన్ మార్క్ ని కూడా దాటేసినట్టుగా తెలుస్తుంది. దీనితో హరిహర వీరమల్లు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి దర్శకత్వం వహించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు