ట్విస్ట్: నార్త్ లో ‘వీరమల్లు’ పరిస్థితి భిన్నం!

ట్విస్ట్: నార్త్ లో ‘వీరమల్లు’ పరిస్థితి భిన్నం!

Published on Jul 22, 2025 3:17 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో మొదటి నుంచీ అనౌన్స్ చేశారు. దీనితో అధికారికంగా పవన్ కెరీర్లో ఇదే మొదటి పాన్ ఇండియా సినిమాగా నిలిచింది.

అయితే ఇంకొక్క రోజులో థియేటర్స్ లో సినిమా పడుతుంది కానీ నార్త్ లో అసలు వీరమల్లు హిందీ వెర్షన్ బుకింగ్స్ కూడా ఇంకా లేకపోవడం గమనార్హం. మాములుగా మన తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కంటే చాలా ముందు హిందీ వెర్షన్ బుకింగ్స్ ముంబై, తదితర కీలక సిటీ లలో ఓపెన్ అయ్యిపోతాయి. కానీ భిన్నంగా మన దగ్గర ఆల్రెడీ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి కానీ అసలు హిందీ వెర్షన్ లో బుకింగ్స్ చూపించడమే లేదు. మరి హిందీ రిలీజ్ ఉన్నట్టా లేనట్టా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు