హరిహర వీరమల్లు : అక్కడ రికార్డుల వేటను ప్రారంభించిన పవర్ స్టార్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని జూలై 24న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది.

అయితే, ఈ చిత్రం కోసం ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ అక్కడి బాక్సాఫీస్ దగ్గర ‘హరిహర వీరమల్లు’ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. యూఎస్‌లో ఈ చిత్రం ప్రీమియర్స్ రూపంలో జూలై 23న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

ఇక ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూపంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version