ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు శుభాకాంక్షలు. అక్టోబర్ 23, 1979లో సూర్యనారాయణ, శివకుమారిల సంతానమే ఈ మాచో హీరోకి బాబాయ్ కృష్ణం రాజు గారే కావడంతో అరంగ్రేటం ఈజీ గానే జరిగింది. 2002 సంవత్సరంలో జయంత్ డైరెక్షన్లో ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ 2004లో వచ్చిన వర్షం సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన చత్రపతితో భారీ హిట్ తో మాస్ ప్రేక్షకుల్లో క్రేజ్ ని, భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకులకు చాల దగ్గరయ్యాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘మిర్చి’ అనే సినిమా చేస్తున్న ప్రభాస్ సంక్రాంతి వరకు ఆ సినిమాతో మన ముందుకు రానున్నాడు. రాజమౌళితో భారీ బడ్జెట్ సినిమా కూడా డిసెంబర్లో ప్రారంభం అవుతుంది.
123తెలుగు.కాం తరపున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.