
మెగాస్టార్ చిరంజీవి కి తమ్ముడిగా తెలుగు తెరకు పరిచయమై అన్నయ్యకి ధీటుగా తనకంటూ ఒక ప్రత్యేకతని మరియు ట్రెండ్ ని క్రియేట్ చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘సుస్వాగతం’, ‘బద్రి’ మరియు ‘ఖుషి’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కి అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరియు అభిమానులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
2012లో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రంతో తనలోని ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్ మరియు తన స్టైల్ ని మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించారు. పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న’ కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి 123తెలుగు.కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.