హ్యాపీ బర్త్ డే సమంత


సమంత కెరీర్ మొదటి నుండి మంచి పేరు సంపాదించుకున్న నటి తన మొదటి చిత్రం “ఏ మాయ చేసావే” తో కుర్రాలని మాయ చేసిన సమంత “దూకుడు” విజయంతో అగ్ర తారలలో చేరిపోయింది. గతేడాది మాత్రమే సమంత ఏడు చిత్రాలను ఒప్పుకుంది అందులో “ఈగ”,”ఎటో వెళ్ళిపోయింది మనసు”,నందిని రెడ్డి చిత్రం,””ఆటోనగర్ సూర్య”,”ఎవడు”,”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”,మరియు “కడల్” చిత్రాలున్నాయి. పరిశ్రమలో అత్యంత బిజీ కథానాయిక సమంతనే. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎటో వెళ్ళిపోయింది మనసు” చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ చిత్రంలో నాని సరసన ఈ భామ కనిపించబోతుంది తన మార్గ దర్శకుడు గౌతమ్ మీనన్ తో కలిసి పని చెయ్యటం సమంత ఎంజాయ్ చేస్తునట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం తనను ఆకట్టుకుంది. సమంత పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కాం బృందం తరుపున శుభాకాంక్షలు.

Exit mobile version