యంగ్ హీరో నానికి జన్మదిన శుభాకాంక్షలు

యంగ్ హీరో నానికి జన్మదిన శుభాకాంక్షలు

Published on Feb 24, 2013 10:00 AM IST

Naani

సినిమా రంగం అంటే ఒక అపోహ. తమకు కావాల్సిన వాళ్ళే తెర మీదకు వస్తారన్న పిచ్చి ఊహ. అలాంటి ఉహలు కేవలం ఉహలు మాత్రమే అని రుజువు చేసిన వాళ్ళలో నాని ఒకడు. ఎటువంటి సినీ నేపధ్యం లేని కుటుంబంలో పుట్టి, మణిరత్నం ‘దళపతి’ సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసి, ఆ సినిమా రగిల్చిన స్పూర్తితో బాపు దగ్గర ‘రాధాగోపాలం’, శ్రీను వైట్ల దగ్గర ‘డీ’ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి ‘అష్టా చమ్మా’ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమై, తన నటనతో, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నాడు. ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ లాంటి వైవిధ్య కధాంశాలు ఎన్నిక చేసుకుని నేటి తరం మేటి హీరోల జాబితాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం కృష్ణ వంశీ ‘పైసా’ చిత్రంలో నటిస్తున్న నాని భవిష్యత్తులో మరింత ఎత్తుకి ఎదగాలని ఆశిస్తూ 123తెలుగు.కామ్ తరపున నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు