డా. మోహన్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

డా. మోహన్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Published on Mar 19, 2014 11:05 AM IST

mohanbabu

ఈరోజు, తెలుగు సినిమా గర్వించదగిన, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు డైలాగ్ కింగ్ పద్మశ్రీ డా.మోహన్ బాబు గారి పుట్టిన రోజు. మోహన్ బాబు అస్సలు పేరు మంచు బక్తవత్సలం నాయుడు. ఇయన 1952 మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగులపాలెంలో జన్మించారు. యేర్పేడు గ్రామం మరియి తిరుపతి లో తన పాఠశాల విద్యను అభ్యసించిన అనంతరం మోహన్ బాబు ఉన్నత విద్య కోసం చెన్నైకి వెళ్లారు.

ఓ పాఠశాలలో ఫిసికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ గా కొంత కాలం పని చేసిన మోహన్ బాబు మనస్సు మాత్రం ఎప్పుడు సినిమా పరిశ్రమ పైనే ఉండేది. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్న మోహన్ బాబుకి 1975 లో డా దాసరి నారాయణరావు గారు ‘స్వర్గం నరకం’లో తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమా తోనే అయన పేరు బక్తవత్సలం నాయుడు నుండి మోహన్ బాబుగా మరిపొయింది.

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి తరువాత డైలాగులు చెప్పడంలో దిట్ట అని డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు మోహన్ బాబు. పెద్ధరాయుడు, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, దేవత తదితర హిట్ సినిమాలలో మోహన్ బాబు నటించారు.

ఇటివలే విడుదలైన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా లో మోహన్ బాబు నటనకు మంచి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. మోహన్ బాబు తదుపరి చిత్రం రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘రౌడీ’.

ఈ విలక్షణ నటుడుకి మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిస్తూ, డా.మోహన్ బాబు గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది 123telugu.com.

తాజా వార్తలు