గుణశేఖర్ రుద్రమ్మదేవి 3D లో రానుందా?

గుణశేఖర్ రుద్రమ్మదేవి 3D లో రానుందా?

Published on Oct 21, 2012 1:00 PM IST


“నిప్పు” లాంటి భారీ ఫ్లాప్ తరువాత గుణశేఖర్ తరువాతి చిత్రం ఎలా ఉండబోతుంది అని అందరు అనుకుంటున్నారు. గుణశేఖర్ మాత్రం తన శైలిని మార్చుకోకుండా ఎప్పటిలానే భారీతనాన్ని ఆశ్రయించేలా కనిపిస్తుంది.ఈసారి ఒక అడుగు ముందుకేసి చారిత్రక ఘట్టం మీద చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. అధికారికంగా ఏది తెలియకపోయినా ఇలాంటి ఒక చిత్రం మీద గుణశేఖర్ పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కథ ఇప్పటికే పూర్తయినట్టు 2013లో ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్నట్టు పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అనుష్క చెయ్యనుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే చిత్రం మీద మరో వార్త వినపడుతుంది ఈ చిత్రాన్ని గుణశేఖర్ 3Dలో తెరకెక్కించనున్నారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే భారతదేశంలో మొదటి చారిత్రాత్మక చిత్రాన్ని 3Dలో తెరకెక్కించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

తాజా వార్తలు