నెట్‌ఫ్లి‌క్స్‌తో‌ వివాదం.. అసలు సంగతేమిటో చెప్పిన గుణశేఖర్


ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గురించి నిన్నటి నుండి ఒక వార్త మీడియాలో తెగ హడావుడి చేస్తోంది. ఆయన ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లి‌క్స్‌తో ఒక వెబ్ సిరీస్ కోసం డీల్ కుదుర్చుకున్నారని, ఒప్పందం మేరకు వెబ్ సిరీస్ కంటెంట్ ను నెట్‌ఫ్లి‌క్స్‌ వారికి పంపించారని, కానీ అది వాళ్లకు నచ్చలేదని, అందుకే రిజెక్ట్ చేశారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒకప్పుడు సూపర్ హిట్లు కొట్టిన గుణశేఖర్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటని ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో జాలిగా మాట్లాడారు.

దీంతో నేరుగా గుణశేఖర్ స్పందించారు. అసలు తాను నెట్‌ఫ్లి‌క్స్‌ సంస్థతో కానీ వేరే ఓటీటీ సంస్థతో కానీ ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని, అసలు తనకు ఆ స్ట్రీమ్ మీద ఆసక్తే లేదని, పుకార్లను నమ్మవద్దని, త్వరలోనే తన నుండి ఒక అప్డేట్ రానుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో అన్ని రూమర్లకు చెక్ పడ్డట్టైంది. ఇకపోతే చాలాకాలం నుండి గుణశేఖర్ రానాతో కలిసి ‘హిరణ్యకసిప’ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బహుశా ఆయన ఇస్తానంటున్న అప్డేట్ ఆ చిత్రం గురించే అయ్యుండొచ్చు.

Exit mobile version