గుమ్మడికాయ పండుగ పూర్తి చేసుకున్న’ లెజెండ్’

గుమ్మడికాయ పండుగ పూర్తి చేసుకున్న’ లెజెండ్’

Published on Mar 18, 2014 6:03 PM IST

Legend

ఒక సినిమా షూటింగ్ పూర్తి అవగానే గుమ్మడికాయను పగలగొట్టడం తెలుగు సిని పరిశ్రమ ఆనవాయితి. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్ర యూనిట్ గుమ్మడికాయ పండుగను జరుపుకుంది. దినితో ‘లెజెండ్’ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాడానికి అంత సిద్ధం అయినట్టే.

నిర్మాణానంతరం పనులు దాదాపుగా పూర్తి చేసుకొని, ఈ నెల 21న సెన్సార్ అనుమతికి వెళ్ళబోతుంది. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ ఈ సినిమా లో హెరాయిన్ లుగా నటిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజా వార్తలు