అక్కినేని నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 22 నుండి మొదలుకానుంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం భిన్న భాషలు నుండి నటీనటులను తీసుకుంటున్నారు ప్రవీణ్ సత్తారు. అందులో భాగంగానే చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్, మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన గుల్‌పనాగ్ ను తీసుకున్నారట.
సినిమాలో ఆమె నాగార్జునకు చెల్లెలిగా కనిపిస్తారని, అది కూడ ఒక మిలీనియర్ పాత్రలో అని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతుందని, కథను మలుపుతిప్పే పాత్రని అంటున్నారు. ఇక హీరోయిన్ విహాస్యానికొస్తే పలువురి పేర్లు వినబడుతున్నాయి ఇంకా ఎవ్వరూవ్ ఫైనల్ కాలేదు. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.