పూర్తైన నాగ్ ‘గ్రీకు వీరుడు’ మూవీ షూటింగ్

పూర్తైన నాగ్ ‘గ్రీకు వీరుడు’ మూవీ షూటింగ్

Published on Feb 26, 2013 10:09 PM IST

Greekuveerudu
‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘గ్రీకు వీరుడు’ సినిమా షూటింగ్ ఈ రోజుతో పూర్తయ్యింది. ఈ రోజుతో ఈ సినిమాలో బాలన్స్ ఉన్న చివరి పాత కూడా పూర్తయ్యింది. ఇంకా రెండు మూడు రోజుల పాచ్ వర్క్ మాత్రం మిగిలి ఉంది. ఏప్రిల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటిసారి ఇండియాకి వచ్చే ఎన్నారై ఈవెంట్ మేనేజర్ పాత్రలో నాగార్జున కనిపించనున్నాడు. దశరథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా వార్తలు