గ్రీకువీరుడు ఒరిజినల్ స్టొరీ – నాగార్జున

గ్రీకువీరుడు ఒరిజినల్ స్టొరీ – నాగార్జున

Published on Feb 26, 2013 9:45 PM IST

Greekuveerudu
‘కింగ్’ అక్కినేని నాగార్జున సరికొత్త స్టైలిష్ అవతారంలో తెరకెక్కిన సినిమా ‘గ్రీకు వీరుడు’. నిన్న రాత్రి విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దశరథ్ డైరెక్టర్. కామాక్షి మూవీస్ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్లో శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ‘ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ ‘మన్మధుడు’ కంటే ముందు వచ్చిన సినిమానా అని ఫీలవుతారు ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున ‘మన్మధుడు’లో కన్నా అందంగా, స్టైలిష్ గా ఉంటాడు. ఈ సినిమాలో ఫస్ట్ రీల్ కే ప్రేక్షకులు హీరో పాత్రకి కనెక్ట్ అయిపోతారు. చూడటానికి డల్ గా కనపడే దశరథ్ సినిమాలు చాలా బాగా తీస్తాడు. మా బ్యానర్లో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మార్చ్ రెంవవారంలో ఆడియో విడుదల చేసి శ్రీ రామనవమి కానుకగా ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ చేస్తున్నామని’ అన్నారు.

డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో నాగార్జున అమెరికాలో పుట్టి పెరిగిన ఒక ఈవెంట్ మేనేజర్ గా కనిపిస్తాడు. టీజర్ చూసిన వాళ్ళందరూ నాగార్జున డాన్సులు బాగా వేసారని అంటున్నారు. ఆ క్రిడిట్ అంతా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కి చెందుతుంది. మేము అనుకున్న పాత్రకి నయనతార పక్కాగా సరిపోయింది, థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా నా కెరీర్లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అని’ అన్నారు.

హీరో నాగార్జున మాట్లాడుతూ ‘ ఇదొక మెచ్యూర్ లవ్ స్టొరీ. ఈ సినిమాలో రిలేషన్స్, లవ్, పెళ్లి మీద నమ్మకంలేని పాత్ర నాది. నా పాత్రకి పూర్తి వ్యతిరేకంగా నయనతార పాత్ర ఉంటుంది. టీజర్ చూసిన తర్వాత చాలా మంది పోన్ చేసి అంత యంగ్ గా ఎలా కనపడుతున్నారు అని అడగటం చాలా ఆనందంగా అనిపించింది. ‘రగడ’ తర్వాత థమన్ నాకు మరో యూత్ ఫుల్ అల్బమ్ ఇచ్చాడు. ఈ సినిమా స్టొరీ ఎక్కడ నుంచి స్ఫూర్తి పొందింది కాదు పక్కా ఒరిజినల్ స్టొరీ. అలాగే ఇందులో విలన్ పాత్రలు ఏమీ ఉండవు ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా అని’ అన్నారు.

తాజా వార్తలు