దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నానితో ‘జెర్సీ’ చిత్రం చేసి.. అదే సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ తిన్ననూరి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తున్నాడని.. త్వరలోనే చరణ్ కి కథ చెప్పనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే గౌతమ్, చరణ్ ను కలిసి కథ చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో గౌతమ్ ఈ సినిమాని రూపొందించే ఆలోచనలో ఉన్నారట. ఇక గౌతమ్, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంలో జెర్సీ కాస్త వెనుక బడినా.. చరణ్ తో చేయబోయే సినిమా పై భారీ ఎక్స్ పెటేషన్స్ ఉంటాయి.