అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా తమిళ యువ నటుడు గోవింద్ పద్మసూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సినిమాలో ఆయన నటనకుగాను ప్రశంసలు దక్కాయి. ఆయనకు గుర్తింపు కూడా పెరిగింది. దీనికంతటికీ కారణం అల్లు అర్జునే అంటున్నాడు గోవింద్ పద్మసూర్య.
షూటింగ్ సమయంలో తన హావభావాల్ని బన్నీ చాలా మెచ్చుకున్నారని, అదే విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారని, అలా ఆయన మాట్లాడటం ద్వారా చాలా మంది దర్శకులు సినిమాలోని ఆ క్లిప్పింగ్స్ స్క్రీన్ షాట్స్ తీసి తనకు పంపుతూ అభినందిస్తున్నారని, అంతేగాక బన్నీ ప్రచార కార్యక్రమంలో తనను ఇంట్రడ్యూజ్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నారని, ఈ ప్రచారం బన్నీ వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు..