తన అభిమాన హీరోలతో నటించే అవకాశం అభిమానులకు జీవితకాలంలో ఎప్పుడో ఒకసారే వస్తుంది. అలాంటి అవకాశం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వచ్చింది. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో చాలా మంది జన సందోహం మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఇందుకు వేరే వారు ఎందుకు అభిమానులైతే బాగుంటుందని పూరి జగన్నాథ్ నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టు గానే ఈ సన్నివేశాలను పవన్ అభిమానులతో కలిసి జూలై లో చిత్రీకరించాలి అనుకున్నారు, కానీ వాతావరణ పరిస్తితులు అనుకూలించకపోవడంతో చిత్రీకరణ వాయిదా పడింది. వాయిదావేసిన చిత్రీకరణని ఆగష్టు 12న చిత్రీకరించాలని పూరి నిర్ణయించుకున్నాడు.
‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రీకరణకు ఆహ్వానిస్తున్నాను. అందరూ ఆగష్టు 12 ఉదయం 9 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ వద్దకు రావాలి, ఈ షూటింగ్ సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని’ పూరి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మరియు తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.