గెట్ రెడీ.. ‘రాజాసాబ్’ నుంచి ఇక నాన్ స్టాప్!

గెట్ రెడీ.. ‘రాజాసాబ్’ నుంచి ఇక నాన్ స్టాప్!

Published on Nov 20, 2025 4:00 PM IST

the raja saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ అలాగే రిద్ధి కుమార్ ఇంకా మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రమే ది రాజా సాబ్. మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ లేదా ఏదొక అప్డేట్ అప్డేట్ ని చాలా రోజులు నుంచి ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా సంగీత దర్శకుడు థమన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి రెడీగా ఉండమంటూ హింట్ ఇచ్చేసాడు. అంతే కాకుండా ఇక నుంచి నాన్ స్టాప్ అంటూ మరో క్రేజీ అప్డేట్ అందించాడు. సో ఇది సినిమా ఫస్ట్ సింగిల్ కోసమే అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పాలి. మరి అదేంటి ఎప్పుడు అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు