బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..”పుష్ప” అప్డేట్ ఇదే అయ్యుంటుందా?

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ – సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ ల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో బన్నీ అభిమానుల్లో అయితే స్పెషల్ అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఒక సరైన అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం షూట్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. కానీ టాక్ అయితే అలా వినిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు కూడా కాస్త గందరగోళంలో ఉన్నారు. దీనితో ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక కీలక ప్రకటన అందించారు. పుష్ప అప్డేట్ అతి త్వరలోనే వస్తుంది అని బన్నీ ఫ్యాన్స్ ను అలెర్ట్ చేసారు.

దీనితో అదేమిటా అని బన్నీ అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం విషయంలో ఎప్పటి ఒక అప్డేట్ ఊరిస్తూ ఉంది. ఈ సినిమాలో బన్నీ ను ఢీ కొట్టే విలన్ ఎవరు అన్నది. బహుశా దాన్ని రివీల్ చేస్తారేమో చూడాలి. లేదా మరే ఇతర అప్డేట్ ఇస్తారేమో చూడాలి. మొత్తానికి మాత్రం బన్నీ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో మొదలయ్యిపోయింది.

Exit mobile version