ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ ల కాంబో కోసం ఏ లెవెల్లో రచ్చ లేస్తుందో తెలిసిందే. దీనితో గత రెండు రోజులు నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మెగా ఫాన్స్ రచ్చ లేపేస్తున్నారు. అయితే మరి ఈ మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈ తరుణంలోనే ఈ అప్డేట్ ఈరోజే వస్తుంది అని చర్చ కూడా స్టార్ట్ అయ్యింది.
మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ సంచనల అప్డేట్ కు టైం అధికారికంగా లాక్ అయ్యింది. ఈ కాంబో పై ఈ రోజు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు వస్తున్నట్టుగా సినిమా వర్గాలు వారు కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఆ టైం కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూడడమే..మరి ఈ కాంబో నుంచి ఎలాంటి సినిమా వస్తుంది ఎన్ని బాక్సాఫీస్ రికార్డులను టచ్ చేస్తుంది అన్నది తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు.