పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు అన్ని ఏరియాల్లో ఇప్పటికీ ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండటం విశేషం. గబ్బర్ సింగ్ చిత్రాన్ని కొన్న డిస్ట్రి బ్యూటర్లకి లాభాలు తెచ్చి పెడుతున్న ఈ చిత్రం నైజాం వంటి కొన్ని ఏరియాల్లో మొదటి వారం కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. పవన్ కళ్యాణ్ హిట్ సినిమా వస్తే దాని రేంజ్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.