తిరుపతి చేరుకున్న గబ్బర్ సింగ్ టీం


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఆడియో ఈ రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ బాబు గబ్బర్ సింగ్ టీం సభ్యుల కోసం ఒక ప్రత్యేక విమానం బుక్ చేసారు. అందులో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తిరుపతికి వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ పవర్ స్టార్ అభిమానులని కలుసుకొని అటు నుండి వైజాగ్ వెళ్లి అక్కడ అభిమానులని కలుసుకొని తిరిగి హైదరాబాద్ చేరుకొని శిల్ప కళా వేదికలో ఆడియో వేడుకకు హాజరు కానున్నారు.

Exit mobile version