సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రుతి హాసన్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. యూనివర్సల్ హీరో కమల్ హసన్ కూతురు అని ఇండస్ట్రీలోకి రాకుండా తనకంటూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని మరీ వచ్చారు. కానీ మొదట్లో శ్రుతి డైలమాలో పడిందంట.! అదేమిటంటే ‘నేను కెమెరా ముందుకు వెళ్లి నటించాలా లేక కెమెరా వెనుక ఉండి ప్రొడక్షన్ వర్క్ చూసుకోవాలా అని డైలమాలో పడ్డాను. అప్పుడు నేను నా మనసు చెప్పినట్టుగా విని హీరోయిన్ అవుదాం అని అనుకున్నాను. నేను నా జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం అది. నా మిగిలిన జీవితం అంతా ఇదే దారిలో ఉండాలని నిర్ణయించుకున్నాను అని’ శ్రుతి అన్నారు.
మీరు ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని అడిగినప్పుడు శృతి మాట్లాడుతూ ‘ ఇలాంటి సందర్భాల్లో అందరూ తన తల్లితండ్రుల సలాహాలు, తమ స్నేహితుల సలహాలు లేక బంధువుల సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ నేను మాత్రం అలా కాదు ఎందుకంటే మనం తీసుకునే ఆ నిర్ణయంతో జీవితాంతం పోరాడాల్సింది మనమే, కనుక నీకు దేని మీద నమ్మకం ఉంటే దాన్ని పూర్తిగానమ్మి అటువైపు వెళ్ళాలి అని’ ఆమె అన్నారు.
ప్రస్తుతం శ్రుతి హాసన్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి చెబుతూ’ ఇది నా మనసుకి హత్తుకున్న ప్రేమ కథ, అందుకే ఈ సినిమాలో నటిస్తున్నాను’ అని ఆమె అన్నారు.