బన్నీ ఖాతాలో సౌత్ ఇండియాలోనే మరో సెన్సేషనల్ రికార్డు!

బన్నీ ఖాతాలో సౌత్ ఇండియాలోనే మరో సెన్సేషనల్ రికార్డు!

Published on Aug 20, 2020 9:15 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా సుశాంత్ మరియు నివేతా పెత్తురాజ్ లు మరో మెయిన్ లీడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్వకత్వంలో తెరకెక్కించిన చిత్రం “అల వైకుంఠపురములో”. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఊహలకు అందని విజయాన్నే అందుకుంది. అయితే ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం మాత్రం ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.

త్రివిక్రమ్ నుంచి అప్పుడెప్పుడో వచ్చిన “జల్సా” ఆడియో పరంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మళ్ళీ అంతటి సెన్సేషన్ ను ఈ జెనరేషన్ లో అల వైకుంఠపురములో నెలకొల్పింది. ఈ చిత్రం విడుదల కాకముందే వచ్చిన లిరికల్ సాంగ్స్ తోనే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఆ పాటలో మాస్ బీట్ “రాములో రాములా” కూడా ఒకటి.

ఇప్పుడు ఈ లిరికల్ సాంగ్ మన దక్షిణాదిలోనే ఫస్ట్ ఎవర్ సెన్సేషనల్ రికార్డును అందుకుంది. ఏకంగా 300 మిలియన్ వ్యూస్ టచ్ చేసిన లిరికల్ వీడియో సాంగ్ గా మన సౌత్ ఇండియాలో ఏ ఇండస్ట్రీలో ఏ హీరోకు కూడా దక్కని రికార్డు బన్నీకు సొంతం అయ్యింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ ఆల్బమ్ మున్ముందు ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు