గత రెండు నెలల కితం బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్యా ఘటన ఎంతటి విషాదాన్ని నెలకొల్పిందో అందరికీ తెలిసిందే. దీని తర్వాత అసలు ఈ విషాద ఘటన చుట్టూతా పెద్ద మిస్టరీయే నడిచింది. ప్రతీ రోజు ఒక్కో మలుపు తిరుగుతూ ఎంతో మంది కీలక వ్యక్తుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి.
అలా ఒకానొక స్టేజ్ లో ఈ కేసు ముగించేస్తారు అన్న సమయంలో సుశాంత్ అభిమానులు మరియు సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో సుశాంత్ కు న్యాయం చెయ్యాలని ప్రతీ రోజు ట్రెండ్ చేస్తూ సిబిఐ కు ఈ కేసు అప్పగించాలని డిమాండ్ చేసారు.
మొత్తానికి వారి సంకల్పం ఇప్పుడు నెరవేరింది. మిస్టరీగా కొనసాగుతున్న ఈ కేసును సుప్రీం కోర్టుకు అప్పగిస్తున్నట్టుగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో వార్త విన్న సుశాంత్ అభిమానులు సహా మన టాలీవుడ్ నటులు కూడా అసలైన న్యాయం ఇప్పటికైనా జరగాలని కోరుకుంటున్నారు.
God is Great ???????? Justice shall prevail ???????? #CBIForSSR #SushanthSinghRajput #ssr https://t.co/Ls0dxSBUq1
— Manoj Manchu????????❤️ (@HeroManoj1) August 19, 2020