సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రమే “కింగ్డమ్”. అయితే ఊహించని రీతిలో సినిమా హిట్ టాక్ అందుకోలేదు. దీనితో ప్లాప్ గానే మిగిలిపోయిన ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ లో అయితే వచ్చేసింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి కింగ్డమ్ మొత్తం పానిండియా భాషల్లో అందుబాటులో వచ్చేసింది. సో అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేయవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు అలాగే నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి