సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావుగారు అనారోగ్యంతో మంగళవారం (ఫిబ్రవరి 11) స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఆయన మృతికి మీడియా లోకంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి ఆప్తుడైన పసుపులేటి రామారావుగారి భౌతిక కాయాన్ని మెగాస్టార్ పూలమాల ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కాగా ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యులు ఈ రోజు సాయంత్రం జరిగిన శ్రీ పసుపులేటి రామారావు గారి సంతాప సభలో రెండు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇక రామారావు మృతికి సంతాపం తెలుపుతూ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్, నాగచైతన్య, పూరి జగన్నాద్, హీరో గోపీచంద్, సాయి శ్రీనివాస్ అలాగే మరికొంతమంది హీరోలు ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసి ఆయనకు నివాళులు అర్పించారు.