దక్షిణాది స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. అందం, అభినయం రెండూ సమపాళ్లలో కలిగిన కీర్తి సురేష్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని వర్గాల్లోనూ ఆమెకు అభిమానులున్నారు.
‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో కూడ గుర్తింపు తెచ్చుకుంది కీర్తి. తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఏ స్టార్ హీరో మొదలైనా ఆ చిత్రానికి కథానాయకిగా కీర్తి సురేష్ పేరు తప్పకుండా పరిశీలనలో ఉంటుంది. అంత పాపులరిటీ ఉంది కీర్తికి. బయటే కాదు సోషల్ మీడియాలో కూడ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.
తాజాగా కీర్తి తన ఇన్స్టాగ్రమ్ నందు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో ఆమె టీ, కాపీ, చెన్నై సిటీ పట్ల తన ప్రేమను వెలిబుచ్చారు. కానీ ఆమె అభిమానులకు అది పెద్దగా పట్టలేదు కానీ కీర్తి సురేష్ లుక్స్ ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలో కీర్తి చాలా స్లిమ్ అయిపోయింది. కీర్తి మొదట్లో బొద్దుగా, బబ్లీగా ఉండేది. ఆ లుక్స్ చూసే ఆమెను కుర్రకారు ఎక్కువగా అభిమానించారు. అలాంటి ఆమె గుర్తుపట్టలేనంతగా సన్నబడిపోయింది.
అది చూసిన ఆమె అభిమానులు కీర్తి.. కొంపదీసి జీరో సైజ్ ట్రై చేస్తున్నావా ఏంటి. ఎంత సన్నబడినా మరీ ఇంతలా తగ్గిపోవాలా అంటూ నిట్టూర్చుతున్నారు. ఆ నిట్టూర్పుతో పాటే నువ్వు బొద్దుగా ఉన్నా సన్నగా ఉన్నా బాగానే ఉంటావ్ అంటూ కితాబిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం కీర్తి ‘గుడ్ లక్ సఖీ, అన్నాతే, మిస్ ఇండియా’ సినిమాలు చేస్తోంది. వాటితో పాటే మహేష్ బాబు చేస్తున్న ‘సర్కారువారి పాట’ చిత్రంలో కూడ ఆమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.