ఎన్.టి.ఆర్ నటించిన ”రామయ్యా వస్తావయ్యా” సినిమా గతవారం భారీ అంచనాల నడుమ విడుదలైంది. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు చాలా డివైడ్ టాక్ నడుస్తుంది. కానీ ఈ టాక్ కి విరుద్ధంగా వారాంతరంలో 20కోట్లు సంపాదించింది.
ఈ డివైడ్ టాక్ గురించి విశ్లేషణ ఇవ్వడానికి దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా తెలిపాడు “ప్రేక్షకులు మా బ్యానర్ నుండి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ఆశించారు.వారి ఊహలకు ‘రామయ్యా వస్తావయ్యా’ అనే టైటిల్ సరిగ్గా సరిపోయింది. కాకపోతే ద్వితీయార్ధంలో వున్న వయలెన్స్, ఫైట్స్ ఈ డివైడ్ టాక్ కు దారితీసాయి. నిమ్మదిగా ఈ సినిమా ను మెచ్చుకుంటున్నారు. వారాంతరంలో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగనుక దీని విజయానికి డోకాలేదు”.
సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషించింది. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించాడు.