ప్రత్యేకం : ఈ నెల 21న ‘ఈగ’ సెన్సార్


అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఈగ’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా ఈ నెల 21న సెన్సార్ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొన్ని సన్నివేశాల గ్రాఫిక్స్ పనులు ఇంకా జరుగుతుండగా విడుదల సమయానికి ఆ సన్నివేశాల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమైతే ఆ సన్నివేశాలు విడుదల తరువాత కలపాలనే యోచనలో ఉన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలతో పాటుగా హిందీ మరియు మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. నాని, సమంతా మరియు సుదీప్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version