మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే ఈ నిర్ణయం బాలీవుడ్ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నచ్చలేదు. ఎందుకంటే అక్టోబర్ 15న అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ సినిమా రిలీజ్ కానుంది. రెండు రోజుల వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు వస్తే బాక్సాఫీస్ క్లాష్ అవుతుందని, వసూళ్లు దెబ్బతింటాయని, ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ కోలుకుంటుంటే ఈ పోటీ అవసరమా అని మండిపడుతున్నారు.
‘మైదాన్’ నిర్మాత బోనీ కపూర్ సైతం ‘ఆర్ఆర్ఆర్’ ఆక్టిబర్ 13న విడుదల అనేసరికి అప్సెట్ అయ్యారు. రెండు చిత్రాల్లోనూ అజయ్ దేవగన్ నటిస్తుండటం వలన వసూళ్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళపడుతున్నారట. అయితే ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాత డివివి దానయ్య అక్టోబట్ 13న విడుదలచేయాలని అనుకోవడం వెనుక ఒక బలమైన రీజన్ ఉందట. అదే డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి. సినిమాను అన్ని ఏరియాల్లో విక్రయించడం జరిగింది. భారీ మొత్తం పెట్టి డిస్ట్రిబ్యూటర్లు హక్కులు కొన్నారు. చాలామంది అప్పులు తెచ్చి డబ్బు చెల్లించారు.
కానీ లాక్ డౌన్ మూలంగా సినిమా ఏడాదికి పైగానే వెనక్కు వెళ్ళిపోయింది. దీంతో అప్పులు తెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్లు వడ్డీలతో సతమవుతున్నారు. అందుకే సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయమని నిర్మాత మీద ఒత్తిడి తెస్తున్నారట. డిస్ట్రిబ్యూటర్ల బాధలో కూడ అర్థం ఉంది కాబట్టి దానయ్య బాగా ఆలోచించి టైట్ షెడ్యూల్ నడుమ అక్టోబర్ 13న రిలీజ్ పెట్టుకున్నారు.