నాగార్జున రాబోతున్న చిత్రం “డమరుకం”లో తన పాట గురించి మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఈ చిత్రంలో తన కొత్త లుక్ ప్రేక్షకులలో ఆసక్తి పెంచింది. ఈ భామ చాలా వరకు బరువు తగ్గింది. “డమరుకం” చిత్రంలో ఐటం సాంగ్ చెయ్యమని నాగార్జున ఈ భామను కోరారు. ఈ పాటలో చార్మీ సక్కుభాయి గా కనిపించనుంది ఈ పాటకి సంబందించిన మరో చిత్రాన్ని చార్మీ పోస్ట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం కోసం అద్భుతమయిన పాటలను ఇచ్చారు అని సమాచారం. దేవిశ్రీ అందించిన ఈ పాట గురించి “దేవిశ్రీ డమరుకం చిత్రంలో సక్కు భాయి పాటతో మరో సారి తన రికార్డ్లను తనే బద్దలు కొట్టుకోనున్నాడు” అని చార్మీ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తుండగా వెంకట్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. నాగార్జున,అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.