పూర్తయిన దూసుకెళ్తా సినిమా షూటింగ్

పూర్తయిన దూసుకెళ్తా సినిమా షూటింగ్

Published on Sep 14, 2013 2:30 AM IST

Doosukeltha

‘దేనికైనా రెడీ’ సినిమా విజయంతో ఉత్సాహం మీద ఉన్నమంచు విష్ణు త్వరలో మనముందుకు ‘దూసుకెళ్తా’ సినిమా ద్వారా రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చివరిదశలో వున్నాయి. నిర్మాతలు ఈ సినిమాను అక్టోబర్లో మనముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న గొడవలు మూలంగా తెలపలేదు.

ఈ సినిమాకు వీరు పొట్ల దర్శకుడు. ‘అందాలరాక్షసి’ సినిమాలో నటించిన లావణ్య హీరోయిన్. కాస్త విరామం తరువాత మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. విష్ణు ఈ సినిమాను సొంత బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై నిర్మించనున్నాడు.ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా సాగనుంది. విష్ణు కామెడీ టైమింగ్ అద్బుతం అని సమాచారం

తాజా వార్తలు