“సర్కారు వారి పాట” కోసం “దూకుడు” టైప్ లో..

“సర్కారు వారి పాట” కోసం “దూకుడు” టైప్ లో..

Published on Feb 11, 2021 4:00 PM IST

మన సూపర్ స్టార్ మహేష్ నటించిన సినిమాల్లో “దూకుడు” సినిమాను మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. సరైన హిట్ లేని సమయంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది. అయితే మరి ఈ చిత్రానికి అలాగే ఇప్పుడు మహేష్ నటిస్తున్న మరో చిత్రం “సర్కారు వారి పాట”కు కూడా ఒక కనెక్షన్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఆ సమాచారం ప్రకారం దూకుడు లో పర్టిక్యులర్ గా కొన్ని స్పెషల్ కామెడీ ఎపిసోడ్స్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే ఆ టైప్ లో ఈ సర్కారు వారి పాటలో కూడా కొన్ని అదిరే కామెడీ ఎపిసోడ్స్ ను దర్శకుడు పరశురామ్ పెట్ల డిజైన్ చేసారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలా ఒక సినిమాలో కొన్ని ట్రెండ్ సెట్టింగ్ కామెడీ సీన్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది మరి ఇందులో నిజంగానే ఆ తరహా సీన్స్ ఉన్నాయో లేదో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు