ఫెబ్రవరిలో ‘డిస్కో’ చేయబోతున్న నిఖిల్

ఫెబ్రవరిలో ‘డిస్కో’ చేయబోతున్న నిఖిల్

Published on Jan 3, 2012 12:00 PM IST


హ్యాపీడేస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నిఖిల్. ప్రస్తుతం అతను నటిస్తున్న కొత్త చిత్రం ‘డిస్కో’. హరి కె చందూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని స్టైల్ ఎంటర్తైన్మెంట్ కె.అబినవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. హరి కె చందూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పూరి జగన్నాధ్ గారి దగ్గర ‘పోకిరి’, ‘నేనింతే’, ‘ఎక్ నిరంజన్’ చిత్రాలకు పని చేసారు. నిఖిల్ కి జంటగా సారా శర్మ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు