‘బలగం’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్న వేణు యెల్డండి తన నెక్స్ట్ చిత్రంగా ‘ఎల్లమ్మ’ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కనున్నట్లు చిత్ర వర్గాల టాక్.
అయితే, ఈ సినిమాలో తొలుత నాని హీరోగా నటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నితిన్ ఈ సినిమాకు ఓకే అని.. అటుపై తప్పుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
కాగా, ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా అలరించబోతున్నాడు. నిర్మాత దిల్ రాజు మొదట అజయ్ – అతుల్ లను సైన్ చేసినప్పటికీ, ఇప్పుడు ఎవరితో కొనసాగుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


